అంగన్‌వాడీల బడిబాట


Tue,June 11, 2019 11:44 PM

హత్నూర: మండల కేంద్రంతో పాటు మల్కాపూర్ గ్రామాల్లో మంగళవారం అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పద్మ, ఇందిర, రత్న, సంగమేశ్వరి, మంగ, కార్యకర్తలు లక్ష్మి, సునంద, లావణ్య, సుశీల, ప్రమీల పాల్గొన్నారు.
గొంగ్లూర్‌లో బడిబాట
పుల్కల్: అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలను చేర్పించాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు బడిబాట ర్యాలీ నిర్వహించారు. మంగళవారం మండల పరిధిలోని గొంగ్లూర్ గ్రామంలో మూడు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలతో బడిబాట కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు.ప్లకార్డులు పట్టుకుని గ్రామంలో ర్యాలీ కొనసాగించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ గొంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...