స్లాట్‌కు చక్కటి ఆదరణ


Tue,June 11, 2019 11:44 PM

- మంగళవారం ఒక్కరోజే 18 స్లాట్ బుకింగ్‌లు
- అక్రమాల అడ్డుకు వీఎల్‌టీ నెంబర్లు
- గజ్వేల్ సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో
-జోరుగా భూములు, స్థలాల విక్రయాలు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: పట్టా మార్పిడిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు వీఎల్టీ(వెకెట్ ల్యాండ్ టాక్స్) నెంబర్ కేటాయింపునకు మంచి స్పందన లభిస్తున్నది. గతవారం రోజులుగా గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల కోసం రద్దీ పెరుగగా ఆన్‌లైన్ స్ల్లాట్ రిజిస్ట్రేషన్ జోరందుకుంది. రెండు నెలలుగా ఇండ్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆందోళనకు గురైన క్రయవిక్రయదారులు పట్టా మార్పిడి కోసం క్యూ కడుతున్నారు. గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 50 పట్టా మార్పిడి డాక్యుమెంట్లు జరగాల్సి ఉండగా 80కి పైగా వస్తున్నట్లు తెల్సింది. ప్రతి నెల రూ. కోటి 90లక్షల 48వేల ఆదాయం లక్ష్యం కాగా గత నెలలో ఇండ్ల ప్లాట్లు పట్టా మార్పిడి నిలిపివేసినా కోటి 43లక్షల 30వేల రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం మొత్తం రూ.20కోట్ల 84లక్షలు ఆదాయం లభించగా.. లక్ష్యం రూ.21కోట్ల 16లక్షలు. గజ్వేల్‌లో భూముల ధరలు పెరుగడం అభివృద్ధి పరుగులు తీయడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టా మార్పిడి ప్రక్రియ వేగం పుంజుకోవడంతో ఆదాయం పెరుగుతుంది.

వీఎల్‌టీతో సెక్యూరిటీ..
వీఎల్‌టీ నెంబర్ కేటాయింపుతో అక్రమ పట్టాలను అరికట్టే అవకాశం ఉంది. మున్సిపల్ కార్యాలయం ప్రతి ఖాళీ స్థలానికి ఓ వీఎల్‌టీ నెంబర్ కేటాయిస్తారు. ఈ నెంబర్ ఆధారంగానే ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఈ నెంబర్ క్లిక్ చేస్తే ప్లాట్ వివరాలు తెలుస్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగవు. ప్రతి ప్లాటుకు వీఎల్‌టీ నెంబర్ తీసుకోవడం ప్లాటుకు రక్షణ అని సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ అధికారులు చెప్తున్నారు.
స్ల్లాట్ రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన..
గజ్వేల్‌లో సోమవారం నుంచి స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాచుర్యంలోకి వచ్చింది. మంగళవారం ఒక్కరోజే 18స్లాట్ రిజిస్ట్రేషన్లు జరుగడం గమనార్హం. ప్రతి రోజు మధ్యాహ్నం 1:30 వరకు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఆ తర్వాత సాధారణ పద్ధతిలో చేస్తున్నారు. సా ్లట్ బుకింగ్ వల్ల తను అనుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ జరగడానికి ముందు రోజులో ఎప్పుడైనా బుకింగ్ చేసుకోవచ్చు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...