త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ


Tue,June 11, 2019 11:44 PM

దుబ్బాక టౌన్ : దుబ్బాక మున్సిపాలిటీలో త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు సం బంధించి రూ. 84 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు పై ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎమ్మెల్యే సమన్వయ సమితి సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య అ ధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సోలిపేట మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపాలిటీలో నిర్మించబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మూలంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈగలు, దోమలు లేకుండా మున్సిపాలిటీ ప్రజలు రోగాల బారిన పడకుండా సంతోషంగా ఉండే అవకాశముందని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుతో ఎక్కడా మురికి నీరు నిలిచే అవకాశం లేదని ఆయన అన్నారు.

రోడ్డు పక్కన ప్రస్తుతం ఉన్న మురికి కాలువలు వరద నీరు పోయేందుకు ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరును శుభ్రం చేసేందుకు మున్సిపల్ పరిధిలో దుబ్బాక, ధర్మాజీపేట, చెల్లాపూర్ వార్డుల్లో వేస్ట్ ట్రీట్‌మెంట్ సిస్టమ్ (ఎస్‌టీపీ) లను ఏర్పాటు చేస్తామని అందుకు అవసరమైన ప్రాథమిక సర్వేను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే సోలిపేట తెలిపారు. మురికి నీరును ఎస్‌టీపీలలో శుద్ధి చేసిన నీరు దుబ్బాక రామసముద్రం చెరువు, ధర్మాజీపేటలోని చెరువు, చెల్లాపూర్‌లోని చెరువుల్లోకి వదలనున్నట్లు తెలిపారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో శాశ్వతంగా మురికినీటి సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు అనారో గ్యం బారినపడకుండా ఉండడంతో పాటు చెరువులు మురికినీటితో కలుషితం కాకుండా ఉంటాయని తెలిపారు. సమావేశంలో దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి, నాయకులు వంగ బాల్‌రెడ్డి, గన్నె భూంరెడ్డి, స్వామి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, యాదగిరి, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...