ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తా


Tue,June 11, 2019 11:44 PM

పాపన్నపేట : ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలోని చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. మంగళవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మృతుల సొంత గ్రామమైన తమ్మాయపల్లికి వెళ్లి బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులు ఎమ్మెల్యేను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. సంఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకుని ఓదార్చారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఏమైనా నా సాయం అందించగలిగితే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పాపన్నపేట తహసీల్దార్ బలరాంను ఆదేశించారు. కొంతమేర నగదు సాయం అందించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం గృహాలు అందేలా చూస్తామన్నారు. అనంతరం తాము సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిలో ఫారెస్ట్ అధికారులు కడీలు పాతి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. ప్రభుత్వ భూమిలో ఫారెస్ట్ అధికారుల కడీలు పాతి రైతులకు ఇబ్బందికి గురిచేస్తే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాల్సిందిగా ఆమె సూచిచారు. ఆమె వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు తాడేపు సోములు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి, నాయకులు గడీల శ్రీనివాస్‌రెడ్డి, పాపన్నపేట, బాచారం సర్పంచులు గురుమూర్తిగౌడ్, వెంకట్‌రాములు, పీఏసీఎస్ చైర్మన్ పుల్లన్నగారి మోహన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా, నాయకులు బీ గోపాల్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, తమ్మాయపల్లి రాంరెడ్డి, జనార్దన్‌రెడ్డి, రవీందర్, స్థానిక వీఆర్వో సుదర్శన్‌సింగ్ తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...