ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Tue,June 11, 2019 11:44 PM

-ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
-80 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
పెద్దశంకంపేట: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలోని స్త్రీశక్తి భవనంలో కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ , పథకం కింద మంజూరైన 90 మంది మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేద కుటుంబంలో పట్టిన ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు బారం కావద్దనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. దీనిద్వారా 18 ఏండ్ల్లు నిండిన ఆడపిల్లలకు పెండ్లి సమయంలో రూ.1లక్ష రూపాయలు అందించేందుకు ప్రభత్వం అండగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకాలకు అపూర్వ స్పందన లబిస్తుందన్నారు. పేదింట్లో ఆడపిల్ల పుట్టినా బారం కావద్దనే ఉద్దేశ్యంతో ఈపథకాలు ప్రవేశ పెట్టారన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్1గా నిలిచిందన్నారు. అవినీతి రహిత పరిపాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆసరా పింఛన్లు పెంచిన ఘనత మొదట మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఇప్పటివరకు వితంతు, వికలాంగ, వృద్ధ్యాప్య, గీత, చేనేత, బీడీ, కార్మికులు పింఛన్లు ఇస్తుండగా ఒంటరి మహిళలకు సైతం పింఛన్లు ఇస్తుందన్నారు. వచ్చే నెలనుంచి రెట్టింపు ఆసరా వస్తుందన్నారు. వితంతు, వృద్ధ్యాప్య, గీతా, చేనేత, బీడీ కార్మికులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ప్రభుత్వం చెల్లించెందుకు ప్రభత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.అలాగే రైతుబంధు, రైలు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బాసాడ రాజు, నూతన ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయరామరాజు,మండల టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మురళీపంతులు, సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతు సమితి అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, సుశీల, మాణిక్‌రెడ్డి, బోండ్ల దత్తు, రమేష్, నాయకులు మల్లేశం, శంకర్‌గౌడ్, పెరుమాల్‌గౌడ్, రవిందర్, అశోక్, శంకరయ్య, సాయిలు, తదితరులున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...