రైలు కూత ప్రారంభం..


Tue,June 11, 2019 12:08 AM

రామచంద్రాపురం : ఎంఎంటీఎస్ రైలు కూత ప్రారంభం కావడంతో ఆర్సీపురం వాసులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు. ఆర్సీపురం నుంచి హైదరాబాద్, ఫలక్‌నుమా వరకు ఎంఎంటీఎస్ రైలు సోమవారం తెల్లావారుజామున ప్రారంభమయింది. లింగంపల్లి వరకు మాత్రమే ఉన్న ఎంఎంటీఎస్ సేవలు ఆర్సీపురం వరకు పొడగించారు. తెల్లావారుజామున 5.05 గంటలకు ఆర్సీపురం స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు కదిలింది. అదేవిధంగా 6.10 గంటలకు ఆర్సీపురం స్టేషన్ నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ రైలు బయలుదేరింది. ఎంఎంటీఎస్ రాక కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచుస్తున్నారు. మొత్తానికి రైల్వే అధికారులు ఈ మార్గం గుండా ఎంఎంటీఎస్ పేజ్-2 సేవలకు మొదలుపెట్టారు.

ఆర్సీపురం స్టేషన్‌ను ప్రారంభించడంతో ఈ మార్గం గుండా మరో పది వేల మంది ప్రయాణికులు రోజు ప్రయాణించే అవకాశం ఉంటుంది. సిగ్నల్ వ్యవస్థ, ఇంజిన్ రోలింగ్‌ని పూర్తి స్థాయిలో పరిశీలించి రైల్వే అధికారులు కమర్షియల్ ఆపరేషన్స్‌ని మొదలుపెట్టారు. లింగంపల్లి నుంచి ఆర్సీపురం వరకు మూడు నూతన స్టేషన్‌లు ఉన్నాయి. ఎంఎంటీఎస్ సేవలు మొదలుకావడంతో ఇక్కడి ప్రజలకు రవాణ సుగమంగా మారనుంది. ఎంతో మంతి ఉద్యోగులు, ఇతర వర్గాల వారు తరచు సొంత పనుల నిమిత్తం జంటనగరాలను వెళ్తుంటారు. ఇప్పటివరకు లింగంపల్లి వరకు మాత్రమే ఎంఎంటీఎస్ సేవలు ఉండడంతో అక్కడి వెళ్లి రైలు ప్రయాణం చేయాలంటే ఇబ్బందులు పడేవారు. అక్కడి వరకు వెళ్లలేక ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవాళ్లు. ఇప్పుడు ఎంఎంటీఎస్ సేవలు ఆర్సీపురం వరకు రావడంతో పటాన్‌చెరు, ఆర్సీపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జంటనగరాలకు బస్సుల్లో, సొంత వాహనాలపైన ప్రయాణం చేసే ఎంతో మందికి ఎంఎంటీఎస్ ఇప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేయనుంది. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు వ్యయం భరించడంతోనే పనులు వేగంగా పూర్తికావడం జరిగింది.

ఎంఎంటీఎస్ ఫేజ్-2లో
ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా తెల్లాపూర్ టూ ఆర్సీపురం వరకు ఉన్న కారిడార్ పనులు వేగంగా జరిగేందుకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిలు పూర్తి స్థాయిలో కృషి చేశారు. ప్రయాణికుల తాకిడిని బట్టి రాళ్ల రాకపోకలను పెంచడంతో పాటు రైళ్ల సమయాలను కూడా పెంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేవలం రెండు రైళ్లను మాత్రమే ఈ మార్గం గుండా నడుపుతున్నట్లు అధికారులు చెప్పారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...