ఇక టోకెన్ సిస్టమ్‌తో రిజిస్ట్రేషన్ సేవలు


Tue,June 11, 2019 12:08 AM

గజ్వేల్‌టౌన్: రిజిస్ట్రేషన్ సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే గజ్వేల్ కార్యాలయంలో టోకెన్ సిస్టాన్ని ప్రారంభించుకున్న రెండో కార్యాలయమని సబ్ రిజిష్ర్టార్ ఎస్.రాజేశ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌లు చేస్తామని, ప్రతి రోజు ముందుగానే టోకెన్‌లను 50 నుంచి 60 వరకు ఇచ్చి రిజిస్ట్రేషన్‌లు చేస్తామన్నారు. అదే విధంగా ప్రతి రోజు ఆన్‌లైన్‌లో స్లాట్‌బుకింగ్ చేసుకున్న వారికి ఉదయం 10.30 నుంచి 1.30 వరకు రిజిస్ట్రేషన్‌లు చేస్తారని పేర్కొన్నారు. 18 వరకు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్‌లు చేస్తామన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు నిబంధనల ప్రకారం వారు వచ్చిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. చాలా మంది నేరుగా కాకుండా స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కార్యాలయానికి వస్తే అందరికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అదే విధంగా 2015కు ముందు ఉన్న ఓపెన్ ప్లాట్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో వీఎల్‌టీ నెంబర్‌ను డబ్బులు చెల్లిస్తే నెంబర్ కేటాయిస్తారని, దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 2015 తరువాత అయిన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన డాక్యుమెంట్‌లకు తమ కార్యాలయంలోనే డిక్లరేషన్ ఫాం అందుబాటులో ఉంటుందన్నారు. వీఎల్‌టీ నెంబర్ తీసుకోవడంతో ప్రతి ఒక్కరి ప్లాట్‌కు రక్షణ ఉంటుందని, ఎవరూ పట్టాదారుడో ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతుందన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...