రైతుబంధు సాయం ఇబ్బందులు లేకుండా చేరాలి


Tue,June 11, 2019 12:08 AM

మెదక్ కలెక్టరేట్: రైతుబంధు సాయం ఇబ్బందులు లేకుండా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె. జోషి అన్నారు. సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసినందున అధికారులు రైతుల డాటా సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రైతుబంధు, 2021 జనాభా లెక్కల సేకరణ అనంతరం గ్రామ పట్టణ రిజిస్టర్‌లలో వివరాలను అప్‌డేట్ చేసి సమర్పించాలన్నారు. తేదీ 1-01-2010 నుంచి 31-12-2019 వరకు పట్టణ, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పడిన జుడిషియల్ మార్పుల వివరాలను ఇవ్వాలన్నారు. 2021 జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌లకు సూచించారు. ఈవిషయమై కలెక్టర్లు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. జనాభా లెక్కలకు సంబంధించి జీఏడీ ద్వారా కలెక్టర్లకు సర్క్యులర్ పంపిచామన్నారు. కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్ ధర్మారెడ్డి, డీఆర్డీవో సీతారామారావు, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...