హరీశ్‌రావును కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్


Tue,June 11, 2019 12:07 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావును జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకు, చైర్ పర్సన్ ఎన్నికకు కృషి చేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లాకు మొట్ట మొదటి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యావు... జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపై ఉందని, ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.

ఆయనను కలిసిన వారిలో టీఆర్‌ఎస్ తూప్రాన్ ఉమ్మడి మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యంజాల సుధాకర్‌రెడ్డి, మనోహరాబాద్ వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, నానిగౌడ్, కో ఆప్షన్ సభ్యులు మునావర్, పెంటాగౌడ్ పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...