జిల్లా అభివృద్ధికి పాటుపడాలి


Tue,June 11, 2019 12:07 AM

కేటీఆర్‌ను కలిసిన జెడ్పీ చైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్
సమర్థవంతంగా విధులు నిర్వర్తించి పదవికే వన్నె తేవాలని చైర్ పర్సన్ హేమలతకు
సూచించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తూప్రాన్, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును మెదక్ జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్‌గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నివాసంలో సోమవారం కలిసిన వారినుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ వారికి అభినందనలు అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మీద నమ్మకం పెట్టుకొని ఈ పదవీ బాధ్యతలు అప్పగిచ్చిండు. ప్రజలకు సేవలందించి ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. మీరు అందించే సేవలతో ఆ పదవికే వన్నె రావాలన్నారు. మీ భర్త శేఖర్ చేసిన సేవలే ఈ రోజు ఈ పదవి తెచ్చి పెట్టాయని అభినందించారు. విధులు సమర్థవంతంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా సార్ తమకు ఇంత పెద్ద పదవి అప్పగిచ్చిండ్రు.... ఏమి చేస్తే మీ రుణం తీర్చుకుంటామని ఆమె భర్త... టీఆర్‌ఎస్ ఉమ్మడి తూప్రాన్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ అనడంతో... కేటీఆర్ మాట్లాడుతూ శేఖర్ ఇప్పటికే చాలా చేశావ్... మీరు చేసిన సేవలే నీకు ఈ రోజు పదవి తెచ్చి పెట్టాయి... ఇక నుంచి మీ సతీమణి ప్రభుత్వ పనులు చేస్తది..మీరు పార్టీకి సేవలు చేయ్.. అధిష్టానం ఇచ్చిన పార్టీ పిలుపులను మరింత సమర్థవంతంగా నిర్వహించు అని అని ఆదేశించారు. అనంతరం వారి కుటుంబ పూర్తి వివరాలు..బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఊహించలేని రోజు: హేమలత శేఖర్‌గౌడ్
ఈ రోజు ఇలా ఉంటుందని ఊహించలేని రోజు అని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపాలని ఆయన ఇంటికి వెళ్తే ఆయన పలుకరింపు.. మా కుటుంబ బాగోగుల గురించి తెలుసుకోవడం... మా పిల్లల పదువులు అడిగితెలుసుకోవడం... మా ఆయన చేసిన సేవలను గుర్తు చేయడం వంటి మాటలు విని మా కళ్లల్లో నీళ్లు నిమిలాయన్నారు. పెద్ద పదవి అప్పగించడంతో పాటు మా కుటుంబ విషయాలు కూడా ఆయనకు గుర్తున్నాయని విన్న మాకు ఇంకేం కావాలి... అని అన్నారు. మా పై ఉన్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెడుతామని, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డితో పాటు మండల నాయకులున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...