రీ ఫిల్లింగ్‌తో బోరు బావులకు పునర్జీవనం


Wed,May 22, 2019 11:50 PM

పాపన్నపేట: రీఫిల్లింగ్‌లతో బోరుబావులు కళకళలాడతాయి అంటూ వాక్‌ఫర్ వాటర్ ప్రతినిధి కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పాపన్నపేట మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామంలో బోర్వేల్ రీచార్జి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నీరు చాలా దూరం ప్రయాణించి మన ఇంటికి వస్తుంది. దాన్ని గౌరవించి వృథా కాకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మనం విచ్చలవిడిగా నీటిని వాడుకోవడం వల్ల భూగర్భంలోకి నీళ్లు ఇంకి పోతున్నాయని వాటిని మళ్లీ భర్తీ చేస్తేనే రేపటి తరాలకు నీళ్లు అందుతాయి అని ఆయన వెల్లడించారు. బోర్ల చుట్టూ ఇం కుడు గుంతలను పోలిన ఫీలింగ్ నిర్మించాలని ఈ దిశగా రైతులను సమాయత్తం చేస్తున్నామని ఇప్పటి వరకు రాష్ట్రవావ్యాప్తంగా 18వేల బోరులను రిఫీలింగ్ చేశామని ఆయన పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో సైతం ఈ పద్ద్ధతిలో బోరు రీఫిలింగ్ అయ్యాయని వెల్లడించారు. బోరు బావి పక్కన 20 ఫీట్ల మేర గొయ్యి తవ్వి, దొడ్డు కంకర, సన్నకంకర, ఇసుక నింపాలని చెప్పారు. వీటిని ఏర్పాటు చేయడానికి సుమారు రూ.70వేల ఖర్చు వస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటిని వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ గుంతను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనురాధ, ఏడుకొండలు, పెండ్యాల ప్రసాద్, మాజీ సర్పంచ్ చావా బాబారావు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...