వేసవి దుక్కులతో రైతుకు మేలు


Wed,May 22, 2019 11:50 PM

మునిపల్లి: వేసవి ఆరంభం నుంచి మండలంలోని రైతులు దుక్కులు దున్నడం, పొలాలన్నీ శుద్ధి చేయడం వంటి పనులు ప్రారంభించారు. వానాకాలం రాక ముందే చాలా మంది రైతులు దుక్కులను దున్ని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. వేసవిలో దుక్కు లు దున్నడం మూలన పొలం ఆరడంతో పాటు పొలంలోని చీడపీడలు సూర్యరశ్మి ప్రభావం వల్ల నశిస్తాయని ఏవో శివకుమార్ చెబుతున్నారు. దీంతో పంటకు తెగుళ్ల బెడద తప్పి దిగుబడి పెరిగి అధిక లాభాలు ఆర్జించేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటయన్నారు. తొలకరి మొదలయ్యే వానాకాలం సీజన్ రాక ముందే ఇప్పటి నుంచి రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకోవాలని ఆయన రైతులకు సూచిస్తున్నారు. వేసవిలో చేసే పొలం పనులను బట్టి పంటల దిగుబడి వస్తాయని, వేసవిలోనే పొలాలను చదును చేసుకోవాలని ఏవో పేర్కొంటున్నారు.

వేసవి దుక్కులతో లాభాలు
వేసవి దుక్కులు చేయడం వల్ల నేల పొరల్లో దాగి ఉన్న పురుగులు, వాటి గుడ్ల సముదాయాలు సూర్యరశ్మి వేడి వల్ల నాశనం అవుతాయి. అడ్డంగా దుక్కులు దున్నడంతో వర్షపునీరు నీటిని పొలంలో ఇంకేటట్లు చేయడమే గాక పొలం కోతకు గురి కాకుండా నివారించ వచ్చు. అందుబాటులో ఉన్న పూడిక మట్టిని పొలాల్లో వేసుకోవడం వల్ల పొలాల్లో కొత్త మట్టి చేరి పొలం సారవంతంగా తయారువుతుంది. దుక్కులు దున్నే రైతులు తమ పొలాలను లోతుగా దున్నుకోవాలి. పంట కోతలు పూర్తి అయిన వెంటనే పొలాలను లోతుగా దుక్కి చేయడం మూలన తొలకరి విత్తుకునే సమయంలో పంటకు అనుకూలంగా ఉంటుంది. పశువుల ఎరువులు ఒండ్రుమట్టి, గొర్రె మందల ఎరువును పొలం నిండా చల్లుకుని దున్నాలి. ఈ విధానం వల్ల పంటలకు కావాల్సిన పోషక పదార్థాలు భూమికి లభిస్తాయి

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...