కట్టుదిట్టమైన బందోబస్తు


Tue,May 21, 2019 11:43 PM

-ఓట్ల లెక్కింపునకు అందరూ సహకరించాలి
-ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
-23న 144 సెక్షన్
-జిల్లా వ్యాప్తంగా అమలులో పోలీస్ యాక్ట్ 30
-ఎస్పీ చందనదీప్తి

మెదక్ మున్సిపాలిటీ : మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు నర్సాపూర్‌లో మూడు కేంద్రాల్లో ఈ నెల 23న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. మంగళవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ హాల్‌లో నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ హాల్స్‌లో గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల కౌంటింగ్ హాల్‌లో సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 టేబుళ్లపై లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు.

కట్టుదిట్టమైన బందోబస్తు...
పార్లమెంట్ పరిధిలోని మెదక్, నర్సాపూర్, గజ్వేల్, పటాన్‌చెరు, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నర్సాపూర్‌లోని మూడు కేంద్రాల్లో ప్రారంభమవుతుందని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఎస్పీ చందనదీప్తి సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షణలో, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యవేక్షణలో సిద్దిపేట సీపీ జోయెల్‌డేవిస్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షణలో నారాయణపేట్ ఎస్పీ చేతనలు పటిష్టమైన భద్రత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. అలాగే ఈ బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 81 మంది ఎస్‌ఐలు, సిబ్బంది మొత్తం కలిపి 650 మంది పోలీసు సిబ్బంది, 90 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30తో పాటు కౌంటింగ్ కేంద్రం చుట్టు పక్కల కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుందని కావున జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...