వెంచర్లకు అనుమతి తప్పనిసరి


Mon,May 20, 2019 11:50 PM

-అన్ని పర్మీషన్లు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలి
-10 శాతం భూమి ప్రభుత్వానికి వదిలేయాలి
-త్వరలోనే అక్రమ వెంచర్లపై తనిఖీలు
-ప్లాట్లు కొనేముందు పంచాయతీ కార్యదర్శుల వద్ద వివరాలు తెలుసుకోవాలి
-జిల్లా పంచాయతీ అధికారి హానూక్‌

వెల్దుర్తి : అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి హనూక్‌ అన్నారు. సోమవారం వెల్దుర్తికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా లే అవుట్లు, అక్రమ వెంచర్లపై త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్‌, వెంచర్లలో పదిశాతం భూమిని ప్రభుత్వానికి వదిలేయాలని, ప్రధాన రహదారి 44 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లు ఉండాలని, అలాగే మురికి కాల్వలు, తాగునీటి వసతి, విద్యుత్‌తో పాటు అన్ని వసతులు కల్పించాలన్నారు. వెంచర్‌ ప్లాన్‌తో పాటు అన్ని పత్రాలతో ఆన్‌లైన్‌లో గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం డీటీసీపీవో అనుమతులు పొందాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ల అభివృద్ధి, ప్లాట్లను విక్రయిస్తే చట్టవిరుద్ధమని, అలా ప్లాట్లను కొనుగోలు చేసినట్లు అయితే వారు కూడా బాధ్యులే అన్నారు. ప్లాట్లను కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా పంచాయతీ కార్యదర్శిని పూర్తి వివరాలు అడిగి అనుమతులు వచ్చిన వెంచర్లలోనే ప్లాట్లను కొనుగోలు చేయాలన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...