రైతు అకౌంట్లలో నుంచి రూ.48,946 డ్రా


Mon,May 20, 2019 11:47 PM

- విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిన
నాగాపూర్‌ రైతు
హవేళిఘనపూర్‌: ధాన్యం డబ్బులు అ కౌంట్లలో జమ కావడంతో వాటిని డ్రా చేసేందుకు వెళ్లిన ఓ రైతు తనకు డ్రా చేయడం రాదని ఓ వ్యక్తికి డ్రా చేయమని చెప్పడంతో రూ.10వేలు డ్రా చేసి ఇచ్చిన్నాడు. రైతుకు వేరే ఏటీఎం ఇచ్చి అందులో నుంచి నగదు డ్రా చేసినట్లు గుర్తించిన రైతు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మండల పరిధిలోని నాగాపూర్‌కు చెందిన ఒంటరి బలరాంరెడ్డి ఈ నెల 17న తన అకౌంటులో ధాన్యం డబ్బులు 58,946 డబ్బులు జమా అయ్యాయి. దీంతో ఆయన ఏటీఎంలో డ్రా చేసుకునేందుకు మెదక్‌ పట్టణంలోని కరూర్‌ బ్యాంక్‌ వద్దకు డ్రా చేసుకునేందుకు వెళ్లాడు. దీంతో తనకు కండ్ల్లు కనిపించడం లేదని అక్కడే ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి రూ.10వేలు డ్రా చేసి ఇవ్వాలని కోరగా ఆ వ్యక్తి బలరాంరెడ్డి అకౌంట్లలో నుంచి రూ. 10వేలు డ్రా చేసి మరో ఏటీఎంను ఇచ్చి పంపించాడు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి అందులో ఉన్న రూ.48,946 డబ్బులను డ్రా చేశాడు. దీంతో సోమవారం బలరాంరెడ్డి డబ్బులు తీసుకునేందుకు వెళ్లి చూడగా అకౌంట్లలో నుంచి డ్రా అయ్యాయని గుర్తించి అవాక్కయ్యాడు. ఈ మేరకు బాధిత రైతు బలరాంరెడ్డి మెదక్‌ పట్టణ సీఐకు ఫిర్యాదు చేశారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...