పదిలో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు


Mon,May 20, 2019 03:55 AM

అల్లాదుర్గం:ప్రతి విద్యార్థి ఉన్నత చదువుల కోసం పదోతరగతి కీలకం.పదోతరగతి ఉత్తీర్ణత అయితే ఏదో ఒక ఉద్యోగంలో రాణించడానికి వీలవుతుంది.పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు,విద్యార్థులు నిరంతరం కృషి చేసి ఆయా పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.ముఖ్యంగా లక్ష్యం సాధించడంలో భాగంగా అనుకున్న మార్కులు వస్తాయో లేదో అన్న విషయంలో వారు ఒత్తిడికి లోను కాకుండా ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేశారు.పాఠశాల సమయంలో కాకుండా ఉదయం,సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు.వారి శ్రమ వృథా కాకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు....
పదోతరగతి ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.అల్లాదుర్గం మండల పరిధిలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు,1 కేజీవీబీ పాఠశాల ఉన్నాయి.ఆరు పాఠశాలలకు గాను ఆరు పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అల్లాదుర్గం బాలు ర పాఠశాలలో 44 మందికి 44 మంది, బాలికల పాఠశాలలో 58 మందికి 58 మంది, చిల్వెర పాఠశాలలో 40 మందికి 40 మంది, ముస్లాపూర్ పాఠశాలలో 58 మందికి 58 మంది, గడిపెద్దాపూర్ పాఠశాలలో 56 మందికి 56 మంది, అల్లాదుర్గం కేజీబీవీ పాఠశాలలో 38 మందికి 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.మొత్తం 294 మం దికి 294 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఫలితాలు సాధించారు. అల్లాదుర్గం బాలిక పాఠశాలకు చెందిన మంకెన భవాని,విధ్య 9.8 జీపీఏ,బాలుర పాఠశాలకు చెందిన కార్తిక్ 9.8 జీపీఏ,ముస్లాపూర్ పాఠశాలకు సాయి స్నేహ 9.8 జీపీఏ సాధించి మండల టాపర్‌గా నిలిచారు.ఉపాధ్యాయుల కృషి,సహకారంతోనే తాము మంచి మార్కులు సాధించడం జరిగిందని మండల టాపర్లు పేర్కొన్నారు.ఇక ముందు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో నిలిచి తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తామని తెలిపారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...