రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం


Mon,May 20, 2019 03:55 AM

తూప్రాన్ రూరల్ : సీఎం కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రైతాంగాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. తూప్రాన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములు పచ్చని పంట పొలాలతో కళకళలాడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్షమన్నారు. రాష్ట్ర రైతాంగం అన్ని రంగాలతో పాటు సమానంగా అభివృద్ధి చేందడానికి సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, జీవిత బీమా ఇన్సూరెన్స్, ఆసరా పింఛన్లు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, భూ రికార్డుల ప్రక్షాళలన పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ నెల 23 వెలువడనున్న ఫలితాల్లో టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు మన్నె నాగరాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...