ఏడుపాయల్లో భక్తుల సందడి


Mon,May 20, 2019 03:55 AM

పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఏడుపాయలకు చేరుకుని దుర్గామాతను దర్శించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి ఆదివారం ఉదయం ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో చైర్మన్ విషుణవర్థన్ రెడ్డి, ఈవో మోహన్‌రెడ్డి, ఏడుపాయల పాలకవర్గ సిబ్బంది రవికుమార్, సూర్య శ్రీనివాస్, సిద్దిపేట శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారయణలతో పాటు పాలకవర్గ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించగా, మరికొందరు ఒడిబియ్యం, కుంకుమార్చనలు, బోనాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు నరిసింహ్మాచారి, శంకర్‌శర్మ, పార్థీవ్‌శర్మ, నాగరాజుశర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాపన్నపేట ఎసై ఆంజనేయులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...