యూనివర్సిటీకి మించి ఎడ్యుకేషన్ హబ్‌లో సదుపాయాలు


Sat,May 18, 2019 11:20 PM

గజ్వేల్ రూరల్: యూనివర్సిటీల కంటే ఎక్కువ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించడంతో పాటు అన్ని విధాల సౌకర్యాలు ఎడ్యుకేషనల్ హబ్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, అకడమిక్ ఆడిట్ సెల్ జేడీ డాక్టర్ ఏవీ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రచార వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, అకడమిక్ ఆడిట్ సెల్ జేడీ డాక్టర్ ఏవీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో తమ యూనివర్సిటీ కంటే కూడా అత్యున్నతంగా బోధనా వసతులను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో 2019హెల్ప్‌లైన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ హరికృష్ణ, అధ్యాపకులు అయోధ్యరెడ్డి, రమేశ్‌బాబు, భవానీ ఉన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...