చెక్‌డ్యాం నిర్మాణ స్థలాల పరిశీలన


Sat,May 18, 2019 11:19 PM

-తీరిన కరెంట్ కష్టాలు
-ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మహానాయకుడు సీఎం కేసీఆర్
-సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మురిసిపోతున్న గ్రామస్తులు

తూప్రాన్ రూరల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. మాటమీద నిలబడే మహానాయకుడని పేరు తెచ్చుకున్న సీఎం కేసీఆర్ కార్యచరణలో అమలు చేసి చూపించారు. ఇచ్చిన హామీని నెల రోజుల వ్యవధిలోనే అధికారులతో పనులు పూర్తి చేయించారు. ఇదే సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనంగా చెప్పొచ్చూ.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తూప్రాన్ మండలం దాతర్‌పల్లి గ్రామస్తుల కరెంట్ కష్టాలు తీరాయి. అటు వ్యవసాయ రైతాంగానికి, ఇటు గృహవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను పొందుతున్నారు.


రూ.30లక్షల విలువ చేసే విద్యుత్ పనులు పూర్తి కావడంతో గ్రామస్తుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. తమ గ్రామానికి కరెంట్ కష్టాలు తీరడంతో గ్రామస్తులు మురిసిపోతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. తూప్రాన్ మండలం దాతర్‌పల్లి ఓ మారుమూల కుగ్రామం. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారి కుటుంబాల సంఖ్య అధికంగానే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఆవిర్భావం నుంచి వ్యవసాయ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌తో పాటు గృహవసరాలకు సైతం నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ వ్యవసాయ రైతాంగానికి, కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. లోవోల్టేజీ సమస్యతో రైతులు సతమతమయ్యారు.

దీంతో పాటే గ్రామానికి సరిపడా విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి సమయాలు వీధుల్లో అంథకారం నెలకొనేది. స్థానిక అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదు. పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి గ్రామస్తులు విసిగిపోయారు. అయితే గతేడాది ఆగస్టు15న మల్కాపూర్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం గానూ సీఎం కేసీఆర్ వచ్చారు.

ముఖ్యమంత్రి మల్కాపూర్‌కు వరాల జల్లు ప్రకటిస్తుండగానే దాతర్‌పల్లికి చెందిన పిట్లసాయిబాబా తమ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ దాతర్‌పల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. దీంతో విద్యుత్‌శాఖ అధికార యంత్రాంగం కదిలింది. వెనువెంటనే అధికారులు దాతర్‌పల్లికి చేరుకుని గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్యలకు కారణాలు గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...