హరితహారానికి మొక్కలు సిద్ధం


Sat,May 18, 2019 11:16 PM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం కింద మొక్కలు నాటడానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రణాళికలు తయారు చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీలో ఖాళీలను గుర్తిస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే జూన్ నెల లేదా జూలై మొదటి వారంలో మొక్కలు నాటడానికి అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. గత సంవత్సరంలో నర్సరీలలో పెంచిన మొక్కలతో పాటు ఈ యేడాది పెంచిన మొక్కలు కూడా నాటడంతో పాటు వాటిని సంరక్షించడానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

నర్సాపూర్ పట్టణంలోని హైదరాబాద్ రూట్టో ఉన్న ఫారెస్ట్ కేంద్ర నర్సరీ ఆధ్వర్యంలో 15 రకాల మొక్కలను 2.25లక్షలు పెంచుతున్నారు. ఇందులో నెమలినార, ఏగిసా, వేప, ఇప్ప, మారేడు, అల్లనేరేడు, సింధూగ, తాని, రాగి, మర్రి, గచ్చకాయ తదితర మొక్కలను పెంచుతున్నారు.
మొక్కల సంరక్షణ కోసం ప్రతిరోజు 12 మంది కూలీలను ప్రత్యేకంగా నియమించారు. వీరు ప్రతి రోజు మొక్కలకు వాటర్ పట్టడంతో పాటు మొక్కలను పెరుగనీయకుండా అడ్డుగా ఉన్న గడ్డిని తొలగిస్తారు. దీంతో కూలీలు వలసలు పోకుండా నివారించి వారికి ఉపాధి అవకాశాలు దొరికేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

55 హెక్టర్లలో నాటేందుకు సన్నాహాలు..
నర్సాపూర్ ఫారెస్ట్ రేంజి పరిధిలోకి వచ్చే మండల పరిధిలోని రెడ్డిపల్లి, చిప్పల్‌తూర్తి గ్రామాల నడుమ సుమారు 15 హెక్టార్‌లలో నర్సాపూర్ సమీపంలో 15 హెక్టార్‌లలో, ఎల్లాపూర్ పరిధిలో 15 హెక్టార్‌లలో, శివ్వంపేట మండలం పిల్లుట్ల పరిధిలో 15 హెక్టార్‌లలో మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశారు. మొక్కల సంరక్షణపై నర్సాపూర్ ఫారెస్ట్ రేంజి అధికారి గణేశ్, సెక్షన్ ఆఫీసర్ బాలేశ్‌తో పాటు ఇతర ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ చేస్తున్నారు.

అందుబాటులో 2.25లక్షల మొక్కలు
హరితహారం పథకం కింద మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశాం. వర్షాలు పడిన వెంటనే నాటడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఫారెస్ట్‌శాఖ ఆధ్వర్యంలో 2.25లక్షలు సిద్ధం చేశాం. పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిచాం. వర్షాలు రాగానే ఎంపిక చేసిన చోట్ల నాటేందుకు కృషి చేస్తాం.
- గణేశ్, నర్సాపూర్ ఫారెస్ట్ రేంజీ ఆఫీసర్

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...