ఘనంగా నర్సింహాస్వామి పూజలు

Sat,May 18, 2019 11:13 PM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ పట్టణ శివారులోని నర్సింహాస్వామి ఆలయంలో శనివారం స్వామివారి కల్యాణం, హోమ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణము, స్వస్తివాచనము, హనుమాన్ ఆలయంలో స్వామివారికి చందనలేతనము, ఒడిబియ్యం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు అహోబిలం రామనయ్య పంతులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, మధు, ప్రదీప్‌శర్మ, ఉప్పల రమేశ్, దేవతావాసుదేవ్, వెంకటేశ్‌తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నాగులపల్లిలో రేణుకామాతా జాతర
తూప్రాన్ మండలం నాగులపల్లిలో శనివారం రేణుకామాతాఎల్లమ్మ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రేణుకామాతా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆదివారం బోనాలు, ఒగ్గుకథ కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు చెప్పారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...