పేదలకు వరం ఉచిత గ్యాస్ పంపిణీ

Sat,May 18, 2019 11:09 PM

వెల్దుర్తి: ఉచిత గ్యాస్‌ల పంపిణీతో ప్రజలకు ఎంతో మేలని మండలంలోని బొమ్మా రం గ్రామ సర్పంచ్ శంకర్ పేర్కొన్నారు. ఉజ్వల పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్‌లను శనివారం ఆయన ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యులతో కలిసి లబ్ధ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన 21 మంది నిరుపేద లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్‌లు మంజూరు అయ్యాయని వాటిని పంపిణీ చేశామన్నారు. గ్యాస్ కనెక్షన్‌లు లేక ఎంతో మంది నిరుపేదలు ఇప్పటికీ కట్టెల పోయ్యి ద్వారా వంటలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఉచిత గ్యాస్‌లను పంపిణీ చేసి ప్రభుత్వం అ లాంటి కుటుంబాలను ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాగ్యమ్మ, నాగమణి, లక్ష్మిలతో పాటు పలువురు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...