పారిశుద్ధ్యం పనులపై దృష్టి కేంద్రీకరించాలి

Sat,May 18, 2019 11:08 PM

-పంచాయతీ కార్యదర్శులకు డీపీవో హనోక్ సూచన తూప్రాన్‌లో సమీక్షా సమావేశం
తూప్రాన్ రూరల్ : గ్రామాల్లో పారిశుద్ధ్యం పనుల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి కేంద్రీకరించాలని డీపీవో హనోక్ అన్నారు. జూన్ నెలలో వర్షాలు కురిసే అవకాశాలున్నందున ఆయా గ్రామపంచాయతీల్లో పరిశుభ్రత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు. తూప్రాన్ ఐకేపీ కార్యాలయంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన కార్యదర్శులతో శనివారం శానిటేషన్‌పై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామపంచాయతీల్లో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూడాలన్నారు. మురికి కాల్వలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేయించాలన్నారు. వీధులు, పురవీధుల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జూన్ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాల్లో వీధులు, ఇంటి పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలుస్తుందని, తద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో మురుగుకాల్వలను శుభ్రం చేయించడం, గ్రామాల్లోని తాగునీటి ట్యాంకులు క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయించడం వంటి అంశాలకు ప్రాముఖ్యతను కల్పించాలన్నారు. అపరిశుభ్రత వాతావరణం, నీరు నిల్వ ఉండటంతో దోమలు, క్రిమికీటకాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల భారిన పడే అవకాశం ఉంటుందని, ఇందుకు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా అవసరమైన మందులు స్ప్రే చేయాలన్నారు. ఏవైనా వ్యాధులు ప్రభలితే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామారావు, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ ఖాజామొజియొద్దీన్, తూప్రాన్ ఈవోపీఆర్డీ రాఘవరావు, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తితో పాటు రెండు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...