ఫిర్యాదులపై స్పందించాలి


Sat,May 18, 2019 11:06 PM

మెదక్ మున్సిపాలిటీ : పోలీస్‌స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ శాంత్రిభద్రతలు, నేరాల అదపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులు మొదలైన అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు అధికారులకు నేర విచారణ, నేర విచారణకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరూ పోలీసు అధికారులు, సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది సహకారంతో తమ విధులు సక్రమంగా నిర్వహించడం వల్ల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయగలిగామని ఎస్పీ చందనదీప్తి పోలీసు అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. అదే విధంగా ప్రతి పోలీస్ అధికారి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ప్రజలకు సేవ చేసి మరింత చేరువ కావాలని తెలిపారు. మొబైల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని, పోలీసు వ్యవస్థ సేవలు ప్రజలకు చేరువలో ఉండాలని సిబ్బందికి సూచించారు.

అదే విధంగా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన అన్ని కేసుల వివరాలు సీసీ టీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేసి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని సూచించారు. అలాగే డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని సూచించారు. రాత్రి పూట పెట్రోలింగ్ సమయంలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను పోర్టబుల్ ఫింగ్ ఫ్రింట్ డివైజ్ ద్వారా తనిఖీ చేయాలని అన్నారు. అదే విధంగా పాత, గత నెలలో జరిగిన కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విచారణలో ఉన్న గ్రేవ్ కేసుల యొక్క వివరాలను, ఎస్సీ, ఎస్టీ కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకొని విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల విషయంలో మూలు మలుపులలో, ప్రమాదాలు జరిగే చోట్లలో సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు.


సిబ్బందికి హెల్మెట్ల ప్రదానం..
పోలీసు సిబ్బందికి హెల్మెట్లను ఎస్పీ చందనదీప్తి ప్రదానం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ దరించి వాహనాలు నడిపేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అదే విధంగా ఈ-పెట్టి కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసుల విషయంలో ఎవరైనా తప్పిపోయారని, కనపించడం లేదని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఫొటోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించి కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాల నివారణ విషయమై పగలు, రాత్రి గట్టి పెట్రోలింగ్, బీట్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...