పరిశుభ్రతకు సహకరించాలి


Sat,May 18, 2019 12:50 AM

-తూప్రాన్‌ను చెత్తరహిత పట్టణంగా చేద్దాం
-మోరీల్లో చెత్త వేస్తే జరిమానాలు
-తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజామొజియోద్దీన్
తూప్రాన్ రూరల్: తూప్రాన్ మున్సిపాలిటీని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకు పట్టణ ప్రజలు సహకరించాని మున్సిపల్ కమిషనర్ ఖాజామొజియోద్దీన్ కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలని సిబ్బందికి ఆయన సూచించారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్యం సిబ్బందితో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలు, ఇండ్ల ముందు ఎలాంటి చెత్తవేయకుండా ఇంటి యజమానులు చూడాలన్నారు. ఇంటి యజమానులు తమ ఇండ్లలోని చెత్తాచెదారాన్ని సేకరించి చెత్తబుట్టల్లో నిల్వ ఉంచాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఆటోట్రాలీ రిక్షాలు, ట్రాక్టర్‌లు వచ్చిన వెంటనే చెత్తను అందులో వేయాలని సూచించారు. అలాగే మురికికాల్వల్లో చెత్త వేయకుండా ఇంటి యజమానులు జాగ్రత్త పడాలన్నారు. కొంత మంది ఇండ్లలోని చెత్తను మోరీల్లోనే వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అయితే అలాంటి ఇంటి యజమానులకు జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజలు సహకరిస్తేనే తూప్రాన్ మున్సిపాలిటీ చెత్తరహిత పట్టణంగా రూపుదిద్దుకుంటుందని, అందుకు ప్రజలు తమ సిబ్బందికి సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు వాడకం ఇప్పటికే నిషేదం విధించడం జరిగిందన్నారు. అయితే తూప్రాన్ పట్టణంలోని వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇండ్ల యజమానులతో త్వరలో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాటిటీ పరిధిలోని గ్రామాల పారిశుద్ధ్యం సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...