పరిషత్ ఓట్ల లెక్కింపునకు సిద్ధంగా ఉండాలి


Sat,May 18, 2019 12:49 AM

-ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
సంగారెడ్డి చౌరస్తా: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాండమైజేషన్ నిర్వహించి కౌంటింగ్ సిబ్బందిని కేటాయించాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ఈ నెల 20లోగా శిక్షణ తరగతులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బంది మే 27న ఉదయం 6 గంటలకు తమ కౌంటింగ్ సెంటర్లలో రిపోర్టు చేయాలని సూచించారు. కౌంటింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలని పేర్కొన్నారు.

ముందుగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందేనని నాగిరెడ్డి అన్నారు. పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చుడాలని కలెక్టర్‌కు వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ హనుమంతరావు, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, జడ్పీసీఈవో రవి, డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...