ప్రాజెక్టు పనులు ఆపే ప్రసక్తే లేదు


Thu,May 16, 2019 11:12 PM

-మల్లన్నసాగర్ పిటిషనర్లకు తేల్చి చెప్పిన ఉన్నత న్యాయస్థానం
-ఆటంకాలు లేకుండా పనులు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశం
-లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగే ప్రాజెక్టు
-పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచన
- తొలిగిన అడ్డంకులు.. ఇక చకచకా పనులు
గజ్వేల్, నమస్తే తెలంగాణ: దేశంలోనే బృహత్తర మంచినీటి పథకంగా మిషన్ భగీరథ గుర్తింపు పొందిందని కేంద్ర తాగునీటి విభాగం అదనపు సలహాదారులు రాజశేఖర్ అన్నారు. గురువారం గజ్వేల్‌లోని కోమటిబండపై మిషన్ భగీరథ వాటర్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు. అంతకుముందు మర్కూక్ మండలం ఎర్రపల్లి, గజ్వేల్ మం డలం దాతర్‌పల్లి, ముడ్రాయి, ఎల్లుపల్లి గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం కేంద్ర తాగునీటి విభాగం ఉప సలహాదారులు రాజశేఖర్ విలేకరులతో మాట్లాడారు. మంచినీరు సరఫరాల్లో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ప్రజల అభిమాన్నాని పొందిందని, గ్రామాల్లో నీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశంలో ఇంత పెద్ద మంచినీటి సరఫరా పథకం ఏ రాష్ట్రంలో లేదని, సరఫరాల్లో కూడా పకడ్బందీగా అమలు జరుగడం అద్భుత అంశంగా పేర్కొన్నారు. నీటి పొదుపుకు ప్రజలు ప్రయత్నించడం శుభ పరిణామంగా భావించారు. ఇలాంటి అద్భుత మంచినీటి పథకాలు ఇతర రాష్ర్టాల్లో కూడా అమలు జరుగాలన్నారు.

మిషన్ భగీరథ పథకంపై కేంద్రం అధ్యయనం
మిషన్ భగీరథ పథకంపై కేంద్రం అధ్యయనం చేస్తుందని రాజశేఖర్ తెలిపారు. అనేక మంచినీటి సమస్యను శాశ్వతంగా నివారించడానికి మిషన్ భగీరథ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని భావించారు. సాంకేతికత, నీటి సరఫరా నిర్వహణ, తదితర అంశాలపై క్షుణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ప్రజల నుంచి పలు రకాలుగా వివరాలు సేకరించారు. మంచినీరు రోజు సరఫరా అవుతుందా.. సరిపోయన్ని నీళ్లు వస్తున్నాయా... ఈ నీళ్లనే తాగుతున్నారా అని మహిళలను అడిగారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ నీళ్లు ఆరోగ్యానికి హానికరమని మిషన్ భగీరథ నీళ్లు స్వచ్ఛమైనవని వివరించారు. సంబంధిత అధికారులతో నీటివాడకం, పొదుపు సరఫరా ఇతర అంశాలపై చర్చించారు. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో మిషన్ భగీరథ, మంచినీటి సరఫరా తదితర అం శాలపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం అవుతారని తెలిసింది. కార్యక్రమంలో అడ్వయిజర్ నర్సింగరావు, చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, మిషన్ భగీరథ ఈఈలు రాజయ్య, శ్రీనివాస్‌చారి, డిప్యూటీ ఈఈలు నాగార్జునరావు, ప్రవీణ్ పాల్గొన్నారు.

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...