ఖజానా శాఖలో కాగిత రహిత సేవలు


Thu,May 16, 2019 11:00 PM

-ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలు
-అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే

మెదక్, నమస్తే తెలంగాణ: కాగిత రహిత సేవలు తీసుకొచ్చేందుకు ఖజానా శాఖ మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ఐఎఫ్‌ఎంఐఎన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా ఆయా శాఖ వారీగా ఉద్యోగుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ పక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌నే బిల్లుల సమర్పణ, తదితర చెల్లింపులు ఉండనున్నాయి. జిల్లాలో 6,600మందిఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు 3,100 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించి కాగిత బిల్లులు కార్యాలయంలో సమర్పిస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఈ-కుబేర్ ద్వారా చెల్లిస్తున్నారు. దీనివలన ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వారి ఖాతాల్లో వేతనాలు జమవుతున్నాయి. తాజాగా తీసుకొచ్చిన విధానంతో కాగిత బిల్లులకు పూర్తిగా కాలం చెల్లనున్నది.

పోర్టల్ ఏంటంటే...
ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్) ప్రతి శాఖకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంటుంది. వీటి ద్వారా లాగిన్ అయ్యాక పూర్తి వివరాలు పొందుపర్చాలి. పూర్తి పేరు, మొదటి పోస్టింగ్ ఎక్కడ, గతంలో ఎక్కడ పని చేశారు.. పదోన్నతులు పొందితే ఆ వివరాలు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారు అనే పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారంతో పాటు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలు తప్పనిసరి. పూర్తిచేసిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా డీటీవోకు పంపాల్సి ఉంటుంది. డీటీవోకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి జీతాలు చెల్లించే ఈ-కుబేర్‌కు పంపుతారు.

త్వరలో కాగిత రహితం..
జిల్లా ఖజానా కార్యాలయం నుంచి జరిగే పనులు తర్వలో పూర్తిగా కాగిత రహితం కానుంది. ఈ పక్రియ వేగవంతం చేసేందుకు అన్ని శాఖాల డ్రాయింగ్ అధికారులకు ఐఎఫ్‌ఎంఐఎస్ కేటాయించారు. ఇందులో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెలలో పూర్తి వివరాలు నమోదు అయితే వచ్చే నెల ఈ పద్ధతి ద్వారా జీతాలు అందనున్నాయి. ప్రస్తుతం ఖజానా శాఖ ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ సేవలు వినియోగిస్తున్నారు. ఇందులో ఆన్‌ఆలైన్ బిల్లుల చేసిన తరువాత హార్డ్ కాపీలను ఖజానా కార్యాలయంలో సమర్పిస్తున్నారు. కొత్త విధానం అమలైతే ఇక హార్డ్‌కాపీల సమర్పణ ఉండదు. కాకపోతే ఖజానా శాఖ సిబ్బందికి ఐఎఫ్‌ఎంఐఎస్‌పై ఇంకా అవగాహన లేదు. పూర్తి శిక్షణ అందిస్తేనే మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఈ-కుబేర్ ఆరంభంలో కూడా సమస్యలు తలెత్తాయి. అనంతరం తొలిగిపోయాయి.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...