అనుమతిలేని లే అవుట్లు చేయొద్దు


Thu,May 16, 2019 10:59 PM

చేగుంట : అనుమతి లేకుండా లే అవుట్లు చేయొద్దని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీపీవో హనోక్ హెచ్చరించారు. మండల కేంద్రం చేగుంటలో ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేగుంట, నార్సింగి పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల కొత్త వెంచర్లు ఏర్పాటవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో కొత్తగా వెంచర్ చేసినా, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ప్రభుత్వ అనుమతులు పొందాలన్నారు. అనుమతులు పొందిన వెంచర్లకు సైతం తప్పని సరిగా వారి పత్రాలను పరిశీలించి 33 ఫీట్ల రోడ్డు ఉండాలన్నారు. లేనిచో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేసిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా ఇండ్ల నిర్మాణం చేపడితే అనుమతి తీసుకోవాలన్నారు.

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు..
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీపీవో హనోక్ తెలిపారు. ఓటును సెల్‌పోన్‌లో చిత్రీకరించి దానిని వాట్స్‌ప్‌లో పెట్టిన సదరు వ్యక్తిపై సూమోటోగా పరిగణలోకి తీసుకుని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురువారం చేగుంటకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14న తేదీన మూడో విడుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ భర్త భాగ్యరాజ్ వేసిన ఓటును సెల్‌ఫొన్‌లో చిత్రీకరించి వాట్స్‌ప్‌లో పెట్టిన సంఘటన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా సుమోటోగా పరిగణలోకి తీసుకొని భాగ్యరాజ్‌తో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...