నర్సరీలలో ఖాళీ ప్యాకెట్ ఉండొద్దు


Thu,May 16, 2019 10:58 PM

-ప్రతి పింఛన్‌దారు రెండు మొక్కలు తప్పని సరిగా పెంచాలి
-వారం రోజుల్లోపు మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండొద్దు
-డీఆర్‌డీఏ పీడీ సీతారామారావు

చేగుంట : ప్రతి రోజూ గ్రామంలోని నర్సరీని పంచాయతీ కార్యదర్శితో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ పరిశీలించాలని, నర్సరీలో ఒక్క ప్యాకెట్ కూడా ఖాళీ లేకుండా మొక్కలు పెంచాలని డీఆర్‌డీఏ పీడీ సీతారామారావు పేర్కొన్నారు. గురువారం చేగుంట, నార్సింగి మండలాల్లో నర్సరీలను పరిశీలించారు. అనంతరం చేగుంట ఐకేపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న వానాకాలం సీజన్‌లో ప్రతి గ్రామంలో లక్ష మొక్కలు నాటాలన్నారు. నర్సరీలలో ఖాళీగా ఉన్న ప్యాకెట్లలో విత్తనాలను మొలకెత్తేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించుకోవాలన్నారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణపై శిక్షణ ఇస్తే చెత్తను రిసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీతో గ్రామంలోని ఇంటింటి సర్వే చేయాలన్నారు. ఎంత మందికి మరుగుదొడ్లు ఉన్నాయి, వాడకంలో ఉన్నాయా, నిర్మించుకున్నవాటికి బిల్లులు వచ్చాయా తదితర వివరాలను సేకరించాలన్నారు. రోడ్డుకు ఇరు వైపుల మొక్కలు నాటి వాటి రక్షణకు ముళ్ల కంచెను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పింఛన్‌దారు రెండు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనోక్, చేగుంట, నార్సింగి మండల ప్రత్యేక అధికారులు జయరాజ్, వసంతరావు, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీవో ఆదినారాయణతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సబ్బంది పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...