బైక్‌ అదుపుతప్పి ఒకరి దుర్మరణం


Thu,May 16, 2019 12:37 AM

రామాయంపేట: బైక్‌ అదుపుతప్పి ఒక యువకుడు దుర్మరణం పాలైన సంఘటన రామాయంపేట బైపాస్‌ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. రామాయంపేట ఎస్‌ఐ మహేందర్‌ కథనం ప్రకారం నిజాంబాద్‌ జిల్లా బోదన్‌కు చెందిన భానుప్రకాశ్‌రెడ్డి(23) తన స్నేహితుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో పెండ్లి పత్రికలను పంచేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రామాయంపేట బైపాస్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో బోదన్‌కు చెందిన భానుప్రకాశ్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న నిజాంబాద్‌ జిల్లా రాకాసిపేటకు చెందిన ఆరెకట్ల శ్రీకాంత్‌రెడ్డిని వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలను నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్‌ఐ మహేందర్‌ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...