సర్కార్‌ స్కూళ్ల హవా


Thu,May 16, 2019 12:37 AM

-ఏడు పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
-మండలంలో 99.6శాతం ఉత్తీర్ణత

టేక్మాల్‌: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వెలువడ్డాయి. మండలంలో మొతం ఏడు ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌, ఒక కస్తూర్భాగాంధీ విద్యాలయం ఉన్నాయి. ఈ యేడాది జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలకు మండలంలోని ఆయా పాఠశాలల నుంచి మొత్తం తొమ్మిది పాఠశాలలో 495 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 493 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99.6శాతంగా మండల ఉత్తీర్ణత నమోదైంది. మోడల్‌ స్కూల్‌ వంద శాతం ఉత్తీర్ణత సాధించగా పోలీస్‌ భావన 10/10 జీపీఏతో మండల టాపర్‌గా, 9.8 జీపీఏతో సాదు లావణ్య, శ్రీలత మండల స్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. గత నాలుగేళ్లుగా మోడల్‌ స్కూల్‌ వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తుంది. ఎలకుర్తి, తంపులూర్‌, టేక్మాల్‌, బొడ్మట్‌పల్లి, ఎల్లుపేట ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.

ధనూర ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థి ఫెయిల్‌ కావడంతో 98శాతం, కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఒకరు ఫెయిల్‌ కావడంతో 97.5శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాలల వారిగా బొడ్మట్‌పల్లి మమత ప్రథమ, సుజాత, నజీయాసుల్తానా ద్వితీయ, ధనూర కీర్తన ప్రథమ, శ్రావణి, కృష్ణ, శివ ద్వితీయ, కుసంగి అన్నపూర్ణ ప్రథమ, విష్ణువర్ధన్‌గౌడ్‌, అరవింద్‌ ద్వితీయ, టేక్మాల్‌ ముస్కాన్‌ ఫాతిమా ప్రథమ, నరేష్‌ ద్వితీయ, తంపులూర్‌ లక్ష్మణ్‌, ఉదయ్‌కిరణ్‌ ప్రథమ, నాగరాణి, వహీదా బేగం, శివకుమార్‌, మానస ద్వితీయ, ఎలకుర్తి క్రాంతికుమార్‌, లలిత ప్రథమ, అబేదాబేగం ద్వితీయ, ఎల్లుపేట సంయోద్దీన్‌ ప్రథమ, గీత, పాండు ద్వితీయ, కస్తూర్భాగాంధీ విద్యాలయం స్వాతి, శైలజ ప్రథమ, భవానీ, సుజాత ద్వితీయ స్థానంలో నిలిచారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...