దేవాలయాలకు టీఆర్‌ఎస్‌ పెద్దపీట -రాష్ర్టాలు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీ


Thu,May 16, 2019 12:35 AM

-రాష్ర్టాలు అభివృద్ధి చెందాలనే సీఎం కేసీఆర్‌ పర్యటన
-పెద్దమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పూజలు
-హరితహారం మొక్కలను జాగ్రత్తగా పెంచాలి

టేక్మాల్‌ః హరితహారంలో నాటేందుకు నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను వేసవి నేపథ్యంలో జాగ్రత్తగా పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని వెంకటాపూర్‌, ఎల్లంపల్లి, సర్మాన్‌కుంట, సాలోజిపల్లి, కాదులూర్‌, బర్ధీపూర్‌ గ్రామాల్లోన్ని నర్సరీలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. హరితహారంలో నాటే మొక్కలకు అనుగుణంగా ఆయా నర్సరీల్లో ఎన్ని మొక్కలను పెంచుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు.

అలాగే వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల ఎదుగుదలకు ఎరువులు వాడాలని, తెగులు సోకినట్లయితే క్రిమిసంహారక మందులు వాడాలన్నారు. ఇందుకోసం ఏవోల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. హరిత హారంలో మొక్కలు నాటే సమయానికి నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకంపై దృష్టిసారించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో పౌలు, టీఏలు గంగారం, బాలరాజు, భూమయ్య, లక్ష్మయ్య, ఎఫ్‌ఏలు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...