బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

Thu,May 16, 2019 12:32 AM

మనోహరాబాద్‌: బాల్య వివాహాలను ప్రోత్సహించిన, జరిపించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మనోహరాబాద్‌ తహసీల్దార్‌ సాయాగౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌ మండలం పర్కిబండ గ్రామానికి చెందిన గగనం రామాంజనేయులు, మైసమ్మల కుమార్తి (16)ను అదే గ్రామానికి చెందిన ఇచ్చి బుధవారం పెండ్లి చేసేందుకు నిశ్చయించుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సాయాగౌడ్‌, ఎస్‌ఐ వరప్రసాద్‌లు అక్కడికి చేరుకుని వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు. వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు నిండనిదే వివాహం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ లక్ష్మణ్‌రావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కవిత, వీఆర్‌వో స్రవంతిలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...