ప్రతి రోజు ఇంటింటికీ భగీరథ తాగునీరు


Thu,May 16, 2019 12:32 AM

దుబ్బాక టౌన్‌ : దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ ప్రతి రోజు భగీరథ తాగునీరు అందించడమే ముఖ్యమని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు మిషన్‌భగీరథ అధికారులతో సాగునీటి సరఫరాపై ఎమ్మెల్యే సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో డీఈ (గ్రిడ్‌) నాగార్జున, ఏఈలు రోహిత్‌, సతీశ్‌గుప్తాలతో పాటు దుబ్బాక మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య, మోగా ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్ర కలను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మిషన్‌భగీరథ ద్వారా పొందుతున్నారని, ఏండ్ల తరబడి తాగునీటి కష్టాలను దూరం చేసిన సీఎం కేసీఆర్‌ను దేవుడిలా కొలుస్తున్నారన్నారు. మిషన్‌భగీరథ పథకాన్ని మొదటి దశలోనే మం జూరు చేసి ఐదేండ్లుగా తాగునీటి కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 140 వాటర్‌ ట్యాంకులను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా ప్రతి రోజు 2కోట్ల 40 లక్షల లీటర్ల తాగునీటిని ప్రజలకు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు.

భగీరథ పథకం ఏర్పాటులో ఎంతో మంది తమ భూములను త్యాగం చేసి ప్రజలకు అందిస్తున్న నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరార నీటి దానం అంత గొప్పది మరొకటి లేదని కానీ వాటిని వృథా చేస్తే అంతటి పాపం మరొకటి ఉండదన్నారు. నీటి వినియోగంలో ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో నీటి సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తుతే వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్‌ పూర్తయితే మిషన్‌భగీరథకు ఢోకా ఉండదన్నారు.

ధర్మాజీపేట, దుబ్బాకలో ఇక ప్రతిరోజు తాగునీరు..దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటతోపాటు దుబ్బాకలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాల్లో తలెత్తిన సమస్యను అధికారులు పరిష్కరించారని, ఇక ప్రతిరోజు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో కొత్తగా నిర్మించే వాటర్‌ ట్యాంకుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసి నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. నల్లాలకు మోటర్లను బిగించి నీటిని అక్రమంగా వాడుకోవద్దని హెచ్చరించారు. త్వరలోనే ఇండ్లలో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. దుబ్బాక రామసముద్రం చెరువు కట్ట సమీపంలో ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌భగీరథ ‘పైలాన్‌' ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది ప్రవీణ్‌, దిలీప్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రొట్టె రమేశ్‌, పర్సకృష్ణ, పడాల నరేశ్‌, లచ్చపేట నర్సింలు తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...