సాకారం కానున్న..సొంత ఇంటి కల


Thu,May 16, 2019 12:31 AM

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ పట్టణంలోని పేద ప్రజల చిరకాలవాంఛ త్వరలో నెరవేరనుంది. ఇండ్లులేని పేదలు, కిరాయి ఇండ్లలో నివాసం ఉంటున్న వారు, స్థిర నివాసం లేక సంచార జీవనం గడుపుతున్న వారు, ఏండ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు సొంత ఇంటికళ నెరవేరనుంది. మరికొద్ది రోజుల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న సొంత ఇండ్లలోకి పేద, నిరుపేద కుటుంబాలు వెళ్లబోతున్నాయి. చలితీవ్రత, వర్షానికి ఉరుస్తున్న పెంకుటింట్లో గడుపుతున్న దుర్భర జీవితానికి నిరుపేదలు త్వరలోనే దూరం కాబోతున్నారు.

పట్టణ శివారులో చురుకుగా కొనసాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను చూసిన పేద ప్రజలు ఇవి తమకే వస్తాయంటూ సంతోషంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు తూప్రాన్‌ పట్టణంలో వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పట్టణంలో 500 డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఇండ్లు లేని నిరుపేదలకు నయాపైసా ఖర్చు లేకుండా డబుల్‌బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ అప్పట్లో హామీ ఇచ్చారు.

అయితే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. తూప్రాన్‌ పట్టణంలో చాలా మంది నిరుపేదలు కిరాయి ఇండ్లు, గుడిసెలు, కూలిపోయే చివరి దశలో ఉన్న పెంకుటింట్లో నివాసం ఉంటున్నారు. సమైక్య పాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట మంజూరు చేసిన డబ్బులు లబ్ధిదారులకు నేరుగా చేరలేదు. అప్పట్లో ప్రభుత్వం నుంచి వచ్చేది మూరెడు అయితే కమీషన్ల పేరిట ఇచ్చేది బారెడు కావడంతో లబ్ధిదారులు ఇండ్లను నిర్మించుకోలేక పోయారు. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇండ్లులేని పేదలు పడుతున్న అవస్థలను చూసిన సీఎం కేసీఆర్‌ అప్పట్లో చలించిపోయారు.

నయాపైసా ఖర్చులేకుండా పేదలకు నేరుగా డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తూప్రాన్‌ పట్టణంలో సైతం డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో తూప్రాన్‌ పట్టణాకి 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.25.20 కోట్ల ప్రత్యేక నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయించారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయాల సముదాయాల సమీపంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను చేపట్టారు. మొత్తం 62 బ్లాక్‌లలో 500 డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు భావించగా ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి.

ఎప్పటికప్పుడూ అధికారుల పర్యవేక్షణ..డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతంగా కొనసాగించడానికి గానూ అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మరో వైపు పంచాయతీ రాజ్‌ ఈఈ వెంకటేశ్వర్‌రావులు పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్‌లతో పనులు పూర్తి చేయించడానికి గానూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ పట్టణంలోని పేద ప్రజల చిరకాలవాంఛ త్వరలో నెరవేరనుంది. ఇండ్లులేని పేదలు, కిరాయి ఇండ్లలో నివాసం ఉంటున్న వారు, స్థిర నివాసం లేక సంచార జీవనం గడుపుతున్న వారు, ఏండ్ల తరబడి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు సొంత ఇంటికళ నెరవేరనుంది. మరికొద్ది రోజుల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న సొంత ఇండ్లలోకి పేద, నిరుపేద కుటుంబాలు వెళ్లబోతున్నాయి. చలితీవ్రత, వర్షానికి ఉరుస్తున్న పెంకుటింట్లో గడుపుతున్న దుర్భర జీవితానికి నిరుపేదలు త్వరలోనే దూరం కాబోతున్నారు. పట్టణ శివారులో చురుకుగా కొనసాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను చూసిన పేద ప్రజలు ఇవి తమకే వస్తాయంటూ సంతోషంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు తూప్రాన్‌ పట్టణంలో వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమీపంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి..

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పట్టణంలో 500 డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. ఇండ్లు లేని నిరుపేదలకు నయాపైసా ఖర్చు లేకుండా డబుల్‌బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. తూప్రాన్‌ పట్టణంలో చాలా మంది నిరుపేదలు కిరాయి ఇండ్లు, గుడిసెలు, కూలిపోయే చివరి దశలో ఉన్న పెంకుటింట్లో నివాసం ఉంటున్నారు.

సమైక్య పాలనలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట మంజూరు చేసిన డబ్బులు లబ్ధిదారులకు నేరుగా చేరలేదు. అప్పట్లో ప్రభుత్వం నుంచి వచ్చేది మూరెడు అయితే కమీషన్ల పేరిట ఇచ్చేది బారెడు కావడంతో లబ్ధిదారులు ఇండ్లను నిర్మించుకోలేక పోయారు. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇండ్లులేని పేదలు పడుతున్న అవస్థలను చూసిన సీఎం కేసీఆర్‌ అప్పట్లో చలించిపోయారు. నయాపైసా ఖర్చులేకుండా పేదలకు నేరుగా డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తూప్రాన్‌ పట్టణంలో సైతం డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రత్యేక దృష్టిని సారించారు.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో తూప్రాన్‌ పట్టణాకి 500 డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన రూ.25.20 కోట్ల ప్రత్యేక నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయించారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయాల సముదాయాల సమీపంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పనులను చేపట్టారు. మొత్తం 62 బ్లాక్‌లలో 500 డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు భావించగా ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి.

ఎప్పటికప్పుడూ అధికారుల పర్యవేక్షణ..డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతంగా కొనసాగించడానికి గానూ అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మరో వైపు పంచాయతీ రాజ్‌ ఈఈ వెంకటేశ్వర్‌రావులు పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్‌లతో పనులు పూర్తి చేయించడానికి గానూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...