రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Thu,May 16, 2019 12:30 AM

-18 లోగా కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తేవాలి
-రూ.45,55,980ల విలువ చేసే 2,574
-క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించాం
-తూప్రాన్‌ పీఏసీఎస్‌ సీఈవో దేవేందర్‌చారి

తూప్రాన్‌ రూరల్‌: తూప్రాన్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నాటికి 609 మంది రైతుల నుంచి 6,944 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తూప్రాన్‌ పీఏసీఎస్‌ సీఈవో దేవేందర్‌ చారి చెప్పారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు శివ్వంపేట, వెల్దుర్తి మండలాలకు చెందిన రైతుల నుంచి రూ.45,55,980ల విలువ చేసే 2,574 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించామన్నారు. క్వింటాళ్లు వరి ధాన్యానికి రూ.1,770లను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

దళారీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరను కల్పిస్తున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.18 లోగా కొనుగోలు కేంద్రాలకువరిధాన్యం తేవాలి: సీఈవో ఈ నెల 18న శనివారం సాయంత్రంలోగా తూప్రాన్‌ పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వరిధాన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని విక్రయించాలనుకునే వారు 18లోపు తేవాలని ఆయన కోరారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...