జాతీయ రహదారి కోసం భూసేకరణ


Thu,May 16, 2019 12:29 AM

నర్సాపూర్‌,నమస్తే తెలంగాణ: నర్సాపూర్‌ పట్టణంతో పాటు మండల పరిధిలో జాతీయ రహదారి కోసం భూసేకరణ చేస్తున్నామని నర్సాపూర్‌ తహసీల్దార్‌ భిక్షపతి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా నర్సాపూర్‌ పట్టణంతో పాటు మండల పరిధిలోని రెడ్డిపల్లి, పెద్దచింతకుంట గ్రామాల పరిధిలో సుమారు 16న్నర ఎకరాల భూమిని 12 మంది రైతుల వద్ద సేకరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ కోసం త్వరలోనే నోటిఫికెషన్‌ వేస్తామని చెప్పారు.

మండలంలో 14841 ఖాతాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో 12879 ఖాతాలను ప్రక్షాళన చేసి వారికి పట్టాపాస్‌ పుస్తకాలను అందచేశామని తెలిపారు. 874 ఖాతాలలో కులం తప్పు, ఇంటిపేరు తప్పు, తండ్రిపేరు తప్పు, సర్వేనంబర్‌ తప్పుల సవరణ కోసం జిల్లా కలెక్టర్‌ అనుమతి కోసం పంపామని కలెక్టర్‌ అనుమతితో ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ సంతకం చేసి రైతులకు కొత్త పట్టాపాస్‌పుస్తకాలను అందచేస్తామని తెలిపారు. ఆయన వేంట వీఆర్‌వో మహేశ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లు రేఖ, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...