మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు


Thu,May 16, 2019 12:29 AM

నర్సరీలను సంరక్షించే బాధ్యత ఫీల్డ్‌అసిస్టెంట్లదే: డీఆర్‌డీఏ పీడీ సీతారామారాజు నర్సరీలు, సోషల్‌ ఫారెస్ట్‌ కింద 8నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 38 నర్సరీల్లో సుమారు 40లక్షల మొక్కలను సంరక్షించడం జరుగుతుందన్నారు. వచ్చే హరితహారంలో ఉమ్మడి మండలంలో 40లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించడంలో నిర్లక్ష్యం చేస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అనంతరం జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రతి రోజు ఫీల్డ్‌అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మరుగుదొడ్లు నిర్మించిన లబ్ధిదారుల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కోటిలింగం, ఏపీవో శ్యామ్‌కుమార్‌లతో పాటు ఉమ్మడి మండలంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...