దేశ రాజకీయాల్లో కీలకం కానున్న టీఆర్‌ఎస్‌


Thu,May 16, 2019 12:27 AM

మనోహరాబాద్‌: సంగారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట జిల్లాలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్‌ చైర్మన్‌ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్‌ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ... తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం తథ్యమన్నారు. దేశరాజకీయాల్లోనూ టీఆర్‌ఎస్‌ కీలకం కానుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ దేశ చరిత్రలోనే అత్యంత పెద్దదన్నారు. కాళేశ్వరం పూర్తైతే రైతుల కష్టాలు దూరం అవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలోనే అంగన్‌వాడీలకు, ఆయాలకు అధిక వేతనం చెల్లిస్తుంది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్‌ నాగిరెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్‌ బండారు భిక్షపతి, ఉప సర్పంచ్‌ రేణుకుమార్‌, నాయకులు ర్యాకల కృష్ణాగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, నానిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...