తుది విడుత పోలింగ్‌ 76.89%


Wed,May 15, 2019 12:11 AM

-8 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్‌
-ఓటింగ్‌ సరళిని పరిశీలించిన కలెక్టర్‌ ధర్మారెడ్డి
-ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్‌
-ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి
-స్ట్రాంగ్‌రూమ్‌లకుబ్యాలెట్‌ బాక్సులు
-సీసీ కెమెరాల నిఘాతో పాటు భారీ బందోబస్తు
మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :మూడోవిడుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. 8 మండలాల్లో 76.89% శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడుతల్లో ప్రశాంతంగా ముగిశాయి. మూడోవిడుత 8 మండలాల్లో తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్‌, మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 19.67% శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటలకు 49.18%శాతం, మధ్యాహ్నం 1 గంటకు 63.51% శాతం పోలింగ్‌ కాగా మధ్యాహ్నం 3గంటల వరకు 71.24% శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో 8 మండలాల్లో మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు 76.89% శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు మారుమూల గ్రామాల్లో సహితం బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో 356 పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు, వృద్ధులు, వికలాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేయించారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించారు. వైద్య సిబ్బంది, అంగన్‌వాడీలు బీఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు పోలింగ్‌ కేంద్రాల వద్ద విధులు నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులందరికీ భోజన సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మోబైల్‌ టీమ్‌లు, స్పెషల్‌ స్వాడ్‌లు, జోనల్‌ అధికారులు, విధులు నిర్వహించారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించారు. మొబైల్‌ టీమ్‌లు సమస్యాత్మక గ్రామాల్లో పర్యవేక్షించాయి. 8 మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. 8మండలాల్లో పోలింగ్‌ శాతం 76.89% నమోదైంది. మొత్తం 1,27,811 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 62,691 ఓట్లు, స్త్రీలు 65,120 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి చిన్న శంకరంపేట మండలం కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రం, మెదక్‌ మండలంలోని వెంకటాపూర్‌లో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు.

ఓటేసిన ఎమ్మెల్యే...
రామాయంపేట మండలం కోనాపూర్‌లోఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనోహరాబాద్‌ మండలంలోని రామాయపల్లిలో రాష్ట్ర ఫుడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బ్యాలెట్‌ బాక్సుల తరలింపు...
మూడోవిడుత మంగళవారం పోలింగ్‌ జరిగిన 8 మండలాలకు గాను 4మండలాలకు సంబంధించిన, మెదక్‌, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీల బ్యాలెట్‌ బాక్సులను మెదక్‌లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. తూఫ్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నార్సింగి, మండలాలకు సంబంధించి బ్యాలెట్‌ బాక్సులను తూప్రాన్‌ సమీపంలోని నోబుల్‌ కాలేజ్‌లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచారు. మెదక్‌, తూప్రాన్‌లో బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరిపి అనంతరం ఫలితాలు అధికారులు వెళ్లడించనున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...