రిసోర్స్‌ పర్సన్‌ మమతను తొలిగించాలి


Wed,May 15, 2019 12:00 AM

-విచారణకు సహకరించని గ్రామస్తులు
-డిస్ట్రిక్‌ మున్సిపల్‌ కోఆర్డినేట్‌ (డీఎంసీ) మల్లీశ్వరిని అడ్డుకున్న గ్రామస్తులు

తూప్రాన్‌ రూరల్‌ : మహిళా పొదుపు సంఘం ఖాతా నుంచి తమకు తెలియకుండానే డబ్బులు విత్‌ డ్రా చేసుకున్న తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్‌ ఐకేపీ రిసోర్స్‌ పర్సన్‌ మమత మాకొద్దంటూ గ్రామస్తులు మరోసారి మొండికేశారు. ఆమెను విధుల నుంచి తప్పించాలని గ్రామ పొదుపు సంఘాల మహిళలు, వారి భర్తలు మంగళవారం పట్టుబట్టారు.అయితే విచారణ కోసం వచ్చిన అధికారులు అయోమయంలో పడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాపూర్‌లో 32 ఎస్‌హెచ్‌జీ గ్రూపులున్నాయి.క్రమం తప్పకుండా నెలనెలా మహిళలు బ్యాంకులో పొదుపు చేసి స్త్రీనిధిబ్యాంకు ద్వారా వచ్చే రుణ సాయంతో ఉపాధి పొందుతున్నారు. గ్రామానికి చెందిన శ్రావ్యగ్రూపు సభ్యులకు తెలియకుండానే రిసోర్స్‌ పర్సన్‌ రూ.30 వేలను ఈ నెల 2న బ్యాంక్‌ నుంచి విత్‌డ్రా చేసుకుంది. విషయం బయట పడటంతో శ్రావ్యగ్రూపు సభ్యు లు రిసోర్స్‌ పర్సన్‌ మమతను నిలదీశారు.దీంతో ఆమె వెంటనే రూ.15వేలను చెల్లించింది. గ్రామంలో పొదుపు డబ్బులు సేకరించడానికి, మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించడానికి గానూ ఈ నెల 10న సీసీ సునిత గ్రామానికి వెళ్లడంతో పొదుపు డబ్బులు చెల్లించడానికి మహిళా సంఘాల సభ్యులు నిరాకరించారు. గ్రామంలో పొదుపు డబ్బుల విషయంలో అక్రమాలు జరిగాయని,విచారణ చేపట్టాలని మహిళా సంఘాల సభ్యులు,వారి భర్తలు పట్టుబట్టడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దీంతో స్త్రీనిధి బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ అనంతకిషోర్‌ సోమవారం గ్రామానికి చేరుకొని గ్రూపు సభ్యుల నుంచి వివరాలు,జరిగిన విషయం తెలుసుకొని విచారణ కొససాగిస్తానని హామి ఇచ్చారు.డిస్ట్రిక్ట్‌ మున్సిపల్‌ కోఆర్డీనేటర్‌ (డీఎంసీ) మల్లీశ్వరి,సీసీ సునిత, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నీలా, రిసోర్స్‌పర్సన్లు ధనమ్మ, విజయ ,స్రవంతిలు మంగళవారం గ్రామానికి చేరుకొని విచారణ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

దీంతో మహిళా సంఘాల సభ్యులు, వారీ భర్తలు ముందు రిసోర్స్‌ పర్సన్‌ మమతను తొలిగించాలంటూ డిమాండ్‌ చేశారు. జరిగిన విషయం తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చామని,విచారణ కోసం వచ్చి న వారు ఎంత సర్ధి చెప్పినప్పటికి వారు విన్పించుకోలేదు.ఓ రకం గా చెప్పాలంటే గందరగోళ వాతావరణ ఏర్పడింది.2014 నుంచి గ్రామంలో ని 32 గ్రూపులకు సం బంధించిన లెక్కలు తీయాలం టూ గ్రామస్తులు మొండికేశారు. గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యు లు తమకు సహకరించడం లేదంటూ డీఎంసీ మల్లీశ్వరీ, రిసోర్స్‌ పర్సన్లు అక్కడి నుంచి తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు గ్రామస్తులు సహకరించడం లేదంటూ మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామోజియోద్దీన్‌కు వివరించడంతో శ్రావ్య గ్రూపుకు సంబంధించిన రికార్డులు,బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టాల్సిందిగా సూచించారు.ఇదిలా ఉండగా గ్రామస్తులు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ రిసోర్స్‌ పర్సన్‌ మమత ఆవేదన వ్యక్తం చేశారు

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...