జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో


Tue,May 14, 2019 11:59 PM

టీఆర్‌ఎస్‌దే ఘనవిజయం

మనోహరాబాద్‌: ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్‌లు అన్నారు. మనోహరాబాద్‌ మండలం పోతారంలో మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సీఎం కేసీఆర్‌ తగిన గుర్తింపు ఇస్తున్నారని కొనియాడారు. పార్టీ ఆవీర్భావం నుండి ఎలాంటి పదవి ఆశించకుండా కార్యకర్తగా, నాయకుడిగా పని చేసిన ర్యాకల హేమలతాకు జెడ్పీ చైర్‌ పర్సన్‌గా అవకాశమివ్వడమే ఉదాహరణ అని అన్నారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటు వేశారన్నారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ను కూడా మనోహరాబాద్‌కు ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుండాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ నాగరాజు, సర్పంచ్‌లు మాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌లు ఆంజనేయులు, కుమార్‌, ఆత్మకమిటీ కమిటీ గ్రామ కో ఆర్డినేటర్‌ నాగిరెడ్డి, ఆత్మకమిటీ డైరెక్టర్‌ బండారు భిక్షపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...