ప్రచారంలో దూసుకెళ్తున్న కారు


Mon,May 13, 2019 02:56 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మూడో విడుత ప్రచారంలో కారు స్పీడు పెంచింది. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు పూర్తికాగా... మూడో విడుత చివరి దశ ఎన్నికలకు ఆదివారం ప్రచారం ముగిసింది. టీఆర్‌ఎస్ అభ్యరుల తరఫున ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గ్రామ గ్రామాన సర్కారు ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. జెడ్పీ, ఎంపీపీ పీఠాల గెలుపే లక్ష్యంగా నాయకులు ప్ర త్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. పల్లెల్లో టీఆర్‌ఎస్ ఆదరణ చూసి ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. మూడో విడుత చివరి దశకు చేరడంతో కారు స్పీడు పెంచింది. పరిషత్ ఎన్నికల్లో చివరి విడుత ఎన్నికలు మెదక్ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల్లో జరుగనున్నాయి. మూడో విడుత ఎన్నికల్లో 8 మండలాల్లో ఎనిమిది జెడ్పీటీసీ, 61 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 1,67,514 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. వారికి తోడుగా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డిలు,పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముమ్మర ప్రచారం చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ము ఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు బేజారెత్తుతున్నారు. అసలు తమకు డిపాజిట్లు వస్తాయా? రావా? అనే అనుమానంతోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు జెడ్పీటీసీ స్థానాలతోపా టు, ఎంపీటీసీ స్థానాలు అన్నింటిని కైవసం చేసుకునే దిశగా తమ వ్యూహాలకు పదును పెట్టారు. బీజేపీ జిల్లాలో ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపలేకపోతుంది.

సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్ అభ్యర్థులగెలుపు
మూడో విడుత ఎన్నికలకు సంబంధించిన నేతలు ప్రచారానికి వెళ్తున్న సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు పరిష్కారానికి పనిచేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అభ్యర్థుల గెలుపునకు పునాదులు కానున్నాయి. ఇప్పటికే ప్రతి మండలంలో ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, పిల్లల చదువుల కోసం నూతన గురుకులాల ఏర్పాటుతోపా టు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదోడి గడుపకు చేరడంతో మంచి ఆదరణ లభిస్తుంది.

ప్రచారంలో ఎమ్మెల్యేలు,టీఆర్‌ఎస్ నేతలు
ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎ త్తున ప్రచారం సాగిం చారు. మెదక్ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పల్లెపల్లెకు వెళ్లి ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. దుబ్బాక నియోజక వర్గంలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధి లోని అభ్యర్థుల గెలు పుకోసం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూం రెడ్డి, భూపతిరెడ్డిలతో పాటు ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటరి ప్రతాప్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

ప్రచారంలో వెనుకబడిన ప్రతిపక్షాలు
ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే చెప్పుకోదగ్గ నేతలు ప్రచారంలో పాల్గొనలేదు స్వయం గా డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ,గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉంపేదర్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌కు దిక్కు, మొక్కు లేకుండా పోయింది. మెదక్, హవేళిఘనపూర్ మండలాల్లో అభ్యర్థులను పోటీలో దింపినప్పటికి నియోజకవర్గ,జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు ప్రచారంలో పాల్గోనలేదు.

14న పోలింగ్....
ప్రచారం ఆదివారంతో ముగిసినప్పటికి ఈనె ల 14న 8 మం డలాల్లో మూడోవిడత పోలిం గ్ జరగనుంది. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల్లో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ నుంది. 1,67,514 మంది మూడోవ విడుత ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...