తండాల రోడ్లకు మహర్దశ


Mon,May 13, 2019 02:52 AM

చిలిపిచెడ్: రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే గ్రామీణ ప్రాంతాలు పురోగతి సాధిస్తాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లు గడిచినా సక్రమంగా రోడ్లులేని తండాలు ఉన్నాయంటే అందులో అతిశయోక్తి లేదు. స్వరాష్ర్టాన్ని సాధించుకున్న అనంతరం బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సీఎం కేసీఆర్ తండాలు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి రోడ్డు లేని తండాలకు రోడ్లు వేయడంతో వారిలో ఆనందం వెళ్లివిరుస్తుంది. మండలంలోని చిట్కుల్ బద్రియ తండా గ్రామపంచాయతీ పరిధిలోని చండూర్ గూజిరి తండా గ్రామాల మీదుగా గౌతాపూర్ రోడ్డు వరకు సుమా రు 5 కిలోమీటర్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కోటీ 98లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడడంతో గిరిజనులకు రవాణా కష్టాలు తీరానున్నాయి. బద్రియ తండా ఏర్పాటై న నుంచి గత పాలకులు బద్రియ గ్రామ అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. చిట్కుల్ గేటు నుంచి బద్రియ తండా, గూజిరి తండా మీదుగా గౌతాపూర్ రోడ్డు వరకు ఉన్న మట్టిరోడ్డు ఆధ్వానంగా ఉండేది. మండలంలో ఈ తండా ప్రజలు నిత్యం ఇదే రోడ్డు గుండా మండలానికి రాకపోకలు చేస్తుంటారు. గతంలో ఈరోడ్డు పై వెళ్లాలంటే గంటల తరబడి సమయం పట్టేదని గ్రామస్తులు వాపోయారు. తండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని పలుమార్లు అధికారులను,నాయకులకు విన్నవించినా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్ని తర్వాత స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో మారుమూల తండాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం నిధులతో చిట్కుల్ గేటు నుంచి గౌతాపూర్ రోడ్డ్డు సు మారు 5 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆరు నెలల క్రితం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నారు. అలాగే మధ్య మధ్యలో కల్వర్టులు నిర్మాణం పనులు కూడా నిర్మింస్తున్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...