నేటి నుంచి రెండో దశ


Fri,April 26, 2019 12:10 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రెండో విడుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. నర్సాపూర్, చిలిప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ మండల కేంద్రంలో నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 28న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న నామినేషన్లను పరిశీలిస్తారు. అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చేనెల 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మే 27న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.

60 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలకు ఎన్నికలు
రెండో విడుతలో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 6 మండలాల్లోని 60 ఎంపీటీసీ, 6 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నర్సాపూర్, చిలిప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి.

337 పోలింగ్ కేంద్రాలు, 1,55,750 మంది ఓటర్లు
రెండో విడుతలో భాగంగా 6 మండలాల్లో జరిగే ఎన్నికలకు 337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు డీపీవో హనోక్ తెలిపారు. 1,55,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు...
నర్సాపూర్, చిలిప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ల ఏర్పాట్లతో పాటు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...