ఒక వ్యక్తి రెండు స్థానాలకు పోటీ చేయరాదు


Fri,April 26, 2019 12:09 AM

-కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్, నమస్తే తెలంగాణ : ఒక వ్యక్తి మండలంలో ఎంపీటీసీ స్థానంతో పాటు జెడ్పీటీసీ స్థానానికి సైతం పోటీ చేసే అవకాశం ఉందని, కానీ ఒక వ్యక్తి రెండు ఎంపీటీసీ స్థానాలకు గానీ, రెండు జెడ్పీటీసీ స్థానాలకు గానీ పోటీ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎంపీడీవోలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడుత ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఈనెల 30వ తేదీన నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల తరలింపునకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని, వీల్ చైర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులకు క్యూలైన్‌తో సంబంధం లేకుండా ఓటేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏఎన్‌ఎం లేదా ఆశా వర్కర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్, మెదక్, నర్సాపూర్, తూఫ్రాన్ ఆర్డీవోలు సాయిరాం, అరుణారెడ్డి, శ్యాంప్రకాశ్, నోడల్ అధికారి రాజిరెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...