తొలి విడుత.. నామినేషన్లకు తెర


Wed,April 24, 2019 11:43 PM

- 65 ఎంపీటీసీ స్థానాలకు 390 మంది అభ్యర్థులు... 433 నామినేషన్లు
- 6 జెడ్పీటీసీ స్థానాలకు 39 మంది అభ్యర్థులు.. 41 నామినేషన్లు
- నేడు నామినేషన్ల పరిశీలన
- 28న విత్‌డ్రాకు అవకాశం
- అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన
- వచ్చే నెల 6న పోలింగ్...27న లెక్కింపు

హవేళిఘనపూర్ : బుధవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. హవేళిఘనపూర్ జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చుక్కన్న గారి సుజాత శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకులతో కలసి నామినేషన్ వేశారు. బుధవారం జెడ్పీటీసీ స్థానాలకు 3, ఎంపీటీసీ స్థానాలకు 49 మంది అభ్యర్థులు, 69 నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు జెడ్పీటీసీ స్థానాలకు 4, ఎంపీటీసీ స్థానాలకు 68 మంది, 88 నామినేషన్లు వేశారు.

రేగోడ్‌లో..
రేగోడ్ : మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక స్థానాలకు మండల స్థాయిలో మొత్తంలో 56 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానానికి 9 నామినేషన్లు దాఖలు కాగా టీఆర్‌ఎస్ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఇండిపెండెంట్లుగా 2 నామినేషన్లు వచ్చాయి. 7 ఎంపీటీసీ స్థానాలకు గాను మూడు రోజుల్లో కలిపి మొత్తం 47 నామినేషన్లు రాగా కేవలం బుధవారం రోజు 37 నామినేషన్లు దాఖలయ్యాయని ఈవోపీఆర్‌డీ లచ్చాలు తెలిపారు.

మండల కేంద్రమైన రేగోడ్‌లో గాంధీ విహ్రానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి డప్పుచప్పుళ్లతో కార్యకర్తలు, మద్దతుదారులను కలుపుకుని అభ్యర్థులు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు వేశారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా స్థానిక ఎస్సై కాశీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. నామినేషన్ల పర్వం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మరింతగా వేడెక్కింది.

పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బుధవారం చివరి రోజు కాగా నామినేషన్లు బారీగా నమోదయ్యాయి. జెడ్పీటీసీ స్థానానికి 4, 12 ఎంపీటీసీ స్థానాలకు 55 నామినేషన్లు దాఖాలైనట్లు ఎంపీడీవో భన్సీలాల్ తెలిపారు. మూడు రోజులు కలిపి జెడ్పీటీసీకి 5, 12 ఎంపీటీసీ స్థానాలకు 59 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా గ్రామాల నుంచి ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్లను వేశారు. మండలంలో అత్యధికంగా రామోజిపల్లి ఎంపీటీసీకి 8, పట్టణంలోని 3వ ఎంపీటీసీ స్థానానికి 6, గొట్టిముక్కుల ఎంపీటీసీ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కమలాపూర్ ఎంపీటీసీ స్థానానికి రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

టేక్మాల్‌లో..
టేక్మాల్ : పరిషత్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు రోజుల కంటే చివరి రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను వేయడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ఉత్సాహాన్ని చూపారు. డప్పు చప్పుళ్లతో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ నామినేషన్ వేయడానికి ఆయా పార్టీల అభ్యర్థులు తరలివచ్చారు. టీఆర్‌ఎస్ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇస్తారి స్వప్న పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. టేక్మాల్-1, టేక్మాల్-2, వేల్పుగొండ, కుసంగి, ఎలకుర్తి, బొడ్మట్‌పల్లి, ఎల్లంపల్లి, ఎల్లుపేట, కోరంపల్లి, తంపులూర్ ఎంపీటీసీలుగా ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు బుధవారం నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు వరకు మొత్తంగా జెడ్పీటీసీకి ఏడు నామినేషన్లు, ఎంపీటీసీకి 70 నామినేషన్లు దాఖలయ్యాయి.

అల్లాదుర్గంలో..
అల్లాదుర్గం : అల్లాదుర్గం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పరిషత్ ఎన్నిలకు సంబంధించి నామినేషన్ల పర్వం బుధవారంతో ముగిసింది. చివరి రోజు ఎంపీటీసీ స్థానానికి 45 నామినేషన్లు, జెడ్పీటీసీ స్థానానికి 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడురోజులుగా మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 మంది, ఒక జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

పాపన్నపేటలో..
పాపన్నపేట : మొదటి విడుతలో జరుగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు బుధవారం కావడంలో వివిధ గ్రామాలనుంచి నామినేషన్లు సమర్పించడానికి వచ్చిన నాయకులు కార్యకర్తలు బాజా భజంత్రీలతో, డప్పుచప్పుళ్లతో మండల కార్యాలయానికి చేరుకోవడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. పాపన్నపేట మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చివరి రోజు నాటికి ఎంపీటీసీ స్థానాలకు 107 నామినేషన్లు దాఖలయ్యాయి. 85 మంది నామినేషన్లు దాఖలు చేయగా 11 మంది అభ్యర్థులు 2సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ నుంచి 3 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 36 నామినేషన్లు, టీఆర్‌ఎస్ నుంచి అత్యధికంగా 57 నామినేషన్లు దాఖలు కాగా స్వతంత్రులు 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో మల్లంపేట ఎంపీటీసీ స్థానానికి పోటీచేస్తున్న టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పుల్లన్న గారి ప్రశాంత్‌రెడ్డి సతీమణి పుల్లన్నగారి చందన టీఆర్‌ఎస్ తరఫున ఎంపీపీ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.

పాపన్నపేట జెడ్పీటీసీ స్థానానికి 5 నామినేషన్లు..
పాపన్నపేట జెడ్పీటీసీ స్థానానికి బుధవారం నామినేషన్ల స్వీకరణ ముగిసేసరికి 5 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో రాణి వెల్లడించారు. టీఆర్‌ఎస్ తరఫున గడీల షర్మిల 2 నామినేషన్ సెట్లు దాఖలు చేయగా, కాంగ్రెస్ తరఫున పబ్బతి హేమలత బుచ్చమ్మొల్ల ఇందిరా నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం కాంగ్రెస్ తరఫున జంగం స్వప్న నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. పాపన్నపేట మండలంలో ఎంపీటీసీ స్థానాలకు 107, జెడ్పీటీసీ స్థానానికి 5 నామినేషన్లు దాఖలయ్యాయి.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...