పకడ్భందీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. ఎన్నికలు నిర్వహించాలి


Wed,April 24, 2019 11:42 PM

మెదక్ కలెక్టరేట్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ అధికారులకు సూచించారు. బుధవారం ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించడానికి జిల్లాకు వచ్చారు. కలెక్టర్ ధర్మారెడ్డి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లకు అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని సూచించారు. శాంతిభద్రతల దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు అవసరమైన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడుతలో జరుగునున్న అన్ని మండలాలకు ఎన్నికల సామగ్రి తరలింపు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల తర్వాత కౌంటింగ్ కొరకు అనేక సమయం ఉన్నందున భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం పరిశీలకుల సమక్షంలో మొదటి విడుత ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల రెండోస్థాయి ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఎస్పీ చందనదీప్తి, జాయింట్ కలెక్టర్ నగేశ్, జెడ్పీ డిప్యూటీ సీఈవో లక్ష్మీబాయి, ఎన్నికల పరిశీలకులు పరశురాం, జిల్లా పంచాయతీ అధికారి హనూక్, నోడల్ అధికారులు రాజిరెడ్డి, మధుమోహన్, రత్నాకర్‌లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...